![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -343 లో.... సీతాకాంత్ రామలక్ష్మి నోటితోనే నేనే రామలక్ష్మిని అని చెప్పించాలని ప్లాన్ చేస్తాడు. రామలక్ష్మి, సీతాకాంత్, రామ్ లు మాట్లాడుకుంటారు. రామ్ రామలక్ష్మిని మిస్ అంటుంటే శ్రీలత వాళ్ళు విని రామ్ అంటున్నా ప్రిన్సిపల్ తనేనేమో సీతాని కొట్టింది కూడా తనేనేమో.. వాళ్లకు ఆల్రెడీ పరిచయం ఉందని శ్రీలత అంటుంది. కానీ బావగారికి మనలాగే ఇంకా డౌట్ ఉందేమోనని శ్రీవల్లి అంటుంది.
రామ్ పూజ చేస్తుంటే మీ మామ్ రాలేదా అని రామలక్ష్మి అడుగుతుంది. ఇప్పుడు మమత ఆంటీ గురించి ఎందుకు అడుగుతుందని రామ్ అనుకుంటాడు. రాలేదు తనకి ఇలాంటివి అన్నీ ఇష్టం ఉండదని రామ్ చెప్తాడు. అంటే బాబుని సీతాగారే చూసుకుంటారన్నమాట. అయినా ధన, సిరిలు ఎక్కడ వాళ్ళ గురించి అడిగితే నేనే రామలక్ష్మి అని తెలిసిపోతుంది. సైలెంట్ గా ఉండడం బెటర్ అని రామలక్ష్మి అనుకొని.. ముందుకూ వస్తుంటే అక్కడ శ్రీవల్లి అక్క అంటూ రామలక్ష్మితో మాట్లాడుతుంది. ఎవరు నీకు అక్కా.. ఇంకా నాకు పెళ్లి కాలేదని రామలక్ష్మి అంటుంది. అయితే పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఎలాంటి వారు కావాలని శ్రీవల్లి అడుగగా.. సీతా గారి లాంటి వారు కావాలని రామలక్ష్మి అంటుంది. వాళ్ళు షాక్ అవుతారు. ఈవిడ సీతా బావ గారి పై మనసుపడిందేమోనని శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత సీతాకాంత్ రామలక్ష్మితో మాట్లాడతాడు. నువ్వు నా రామలక్ష్మివే కదా అని సీతాకాంత్ అడుగగా.. లేదని రామలక్ష్మి అంటుంది.
అదంతా శ్రీలత వాళ్ళు చూస్తుంటారు. మాక్కూడా ఒక క్లారిటీ వస్తుందనుకుంటారు. ఆ తర్వాత రామలక్ష్మిని స్వామి దగ్గరికి తీసుకొని వస్తాడు. స్వామి గతం లో రామలక్ష్మితో మాట్లాడిన మాటలు గుర్తుచేసుకుంటాడు.ఎక్కడ స్వామి నిజం చెప్తాడోనని రామలక్ష్మి భయపడుతుంది. మనది అనుకున్నప్పుడే బంధం.. అలా అనుకోనప్పుడు అపరిచితులే అవుతారని స్వామి అనగానే.. విన్నారుగా నేను మీ రామలక్ష్మిని కాదని రామలక్ష్మి అక్కడ నుండి వెళ్లిపోతుంది. సీతాకాంత్ డిస్సపాయింట్ అవుతాడు. శ్రీలత వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |